ICC World Cup 2019: Virat Kohli Tries A Hand At Bowling In Nets!! | Oneindia Telugu

2019-05-31 800

Videoe Link: https://telugu.mykhel.com/cricket/icc-cricket-world-cup-2019-virat-kohli-tries-a-hand-at-bowling-020885.html

ICC World Cup 2019:India have commenced their training session after touching down in Southampton for their clash against South Africa on June 5 and the Men in Blue look to start their World Cup campaign with a win over the Proteas.
#iccworldcup2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రపంచకప్‌ 2019లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీరు ఇదే అనుకుంటారు. ఎన్నో ఆశలతో ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ప్రస్తుతం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో నెట్స్‌లో విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీనికి అభిమానులు తమదిన్ స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. 'ప్రపంచకప్‌లో కోహ్లీ మరో అవతారం ఎత్తునున్నాడు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'టీమిండియాకు ఆరో బౌలర్‌ దొరికాడు' అని మరో అభిమాని ట్వీటాడు. 'కేదార్‌ జాదవ్‌ అందుబాటులో లేకుంటే అతడి బౌలింగ్‌ కోటాను కోహ్లితో భర్తీ చేయించవచ్చు' అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
టీమిండియా ఆటగాళ్లకు సహాయక కోచ్‌ శ్రీధర్‌ ఫీల్డింగ్‌ డ్రిల్‌ను నిర్వహించిన మరో వీడియోను కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేయడం, వికెట్లకు నేరుగా బంతిని వేయటం వంటివి ప్రాక్టీస్‌ చేశారు. రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి పోరులో తలపడనుంది.